Saturday, December 10, 2011

श्रीमत्पिङ्गलाचार्य विरचितं छन्दश्शास्त्रम् ।


శ్రీమద్ పిఙ్గళాచర్య విరచిత ఛన్దశ్శాస్త్రము.

अथ प्रथमोध्यायः । ప్రథమోధ్యాయము.

1. धी श्री स्त्री म्
ధీ శ్రీ స్త్రీ -->; "గురు-గురు-గురు" = "మ"గణం. మూడు గురువులు.
2. वरा सा य्
వరా సా  --> "లఘు-గురు-గురు" = "య"గణం. ఆది లఘువు.
3. का गृहा र्
కా గృహా --> "గురు-లఘు-గురు" = "ర" గణం. మధ్య లఘువు.
4. वसुधा स्
వసుధా  --> "లఘు-లఘు-గురు" = "స"గణం. అన్త్య గురువు.
5. सा ते क्व त्
సా తే క్వ --> "గురు-గురు-లఘు" = "త"గణం. అన్త్య లఘువు.
6. कदा स ज्
కదా స --> "లఘు-గురు-లఘు" = "జ"గణం.  మధ్య గురువు.
7. किं वद भ्
కిం వద --> "గురు-లఘు-లఘు" = "భ"గణం.  ఆది గురువు.
8. न हस न्
న హస --> "లఘు-లఘు-లఘు" = "న"గణం.  మూడు లఘువులు.
9.गृ ल्
గృ లఘువగును. "ల్" లఘు వాచకం. "గృ" హ్రస్వాక్షర సూచకం.
10. न्ते ।
(లఘువు) పాదాంతమునందు గురువుగును. "గ్" గురువాచకం.
1-10 సూత్రములందు ఉల్లిఖితమైన అక్షరాలను ఈ క్రింది క్రమంలో వ్రాసినచో, గణవాచక సంజ్ఞలు సులభమగును. य मा ता रा ज भा न स ल गं ను మాత్రానిర్దేశము చేసినచో "ల.గు.గు.గు.ల.గు.ల.ల.ల.గు." అగును. ఇందు,  ప్రతీ అక్షరమూ, తనతో పరమందున్న రెండక్షరములతో కలిపి గణవాచకమును తెలుపును. ఉదా, మాతా లో మొదటి అక్షరం = "య్"; యమాతా --> ల.గు.గు. --> "య"గణం. మాతారా లో మొదటి అక్షరం = "మ్"; మాతారా --> గు.గు.గు. --> "మ" గణం. మొ॥

11. ध्रादिपरः ।
 ధ్రాదులు పరముగానున్నది (గురువు). "ధ్ర" అక్షరం, వ్యంజన సంయోగలక్షణ సూచకం. "ఆది" పదముతో, విసర్గ-అనుస్వార-జిహ్వామూలీయ-ఉపధ్మానీయములను గ్రహించాలి. సంయుక్తాక్షరములు, విసర్గ-అనుస్వార-జిహ్వామూలీయ-ఉపధ్మానీయములు పరముగా ఉన్న అక్షరములూ గురువులే.
12. हे ।
"హే" "గ్" అగును. "హే" ద్విమాత్రోచ్ఛారణ సూచకం. అట్టి దీర్ఘాక్షరములు గురువులగును.
13. लौ सः ।
అది (గురువు) రెండు "ల్"లు. గురువు రెండు మాత్రలు కల్గినదై, రెండు లఘువులుగా గణింపవలెను.
14. ग्लौ ।
"గ్", "ల్" లు. ఇది అధికార సూత్రం. ప్రత్యేకించి చెప్పబడనప్పుడు (ప్లుతమును గాక) గురు-లఘువులనే గ్రహింపవలెను.
15. अष्टौ वसव इति ॥
వసువులనగా ఎనిమిది అని. ఈ ఛందశ్శాస్త్రమందు, (అష్ట)వసువులుగా చెప్పబడిన చోట, ఈ ఎనిమిది గురు-లఘు స్వరూప వర్ణములు గ్రహింపవలెను. "ఇతి" శబ్దం ప్రథమాధ్యాయ సమాప్తసూచకం కూడా.

విశేషములుః

धी श्री स्त्री । वरा सा । का गृहा । वसुधा । सा ते क्व । कदा स । किं वद । न हस । गृ । गन्ते । ध्रादिपरः । हे । लौ सः । ग्लौ । अष्टौ वसव इति ।

अध्ययनात् "धी" भवति । यस्य "धीः" तस्य "श्रीः", बुद्धिपूर्वकत्वात् विभूते । यस्य "श्रीः", तस्य "स्त्री", अर्थमूलकत्वात् गार्हस्थस्य । "वरा सा" इति अनेन सर्वेषां स्त्री साधनोपायानां बुद्धेः उपायस्य माहात्म्यं दर्शयति । तथा च उक्तम् -

अर्थोङ्गुलपरीणाहजिह्वाग्रायासभीरवः ।
सर्वाङ्गीणपरिक्लेशमबुधाः कर्म कुर्वते ॥

तत्राह शिष्यः - का गृहा ?
आचार्यः - वसुधा
शिष्यः - सा ते क्व ?
आचार्यः - गृहे
शिष्यः - कदा सः?
आचार्यः - ध्रादिपरः
शिष्यः - किं वद ?
आचार्यः - न हसन्

इति प्रथमोध्यायः । ఇట్లు ప్రథమోధ్యాయము.

अथ द्वितियोऽध्यायः । ద్వితీయోऽధ్యాయము.
1. छन्दः ।
శాస్త్రపరిసమాప్తి వరకు అధికార సూత్రం. ఛన్దః శబ్దముతో సంఖ్యావాచకం గ్రహింపవలెను.
2. गायत्री ।
గాయత్రీ (తదుపరి  12 సూత్రములవరకూ). అధికార సూత్రం.
3. दैव्येकम् ।
(గాయత్రీ) దైవమందు ఒకటి.
4. आसुरी पञ्चदश ।
(గాయత్రీ)  ఆసురమందు పదిహేను.
5. प्राजापत्याष्टौ ।
(గాయత్రీ)  ప్రజాపతియందు ఎనిమిది.
6. यजुषां षट् ।
(గాయత్రీ)  యజుస్సునందు ఆఱు.
7. साम्नां द्विः ।
(గాయత్రీ)  సామమందు రెండింతలు (యజుస్సునకు)
8. ऋचां त्रिः ।
(గాయత్రీ)  ఋక్కులందు మూడింతలు (యజుస్సునకు)
9. द्वौ द्वौ साम्नां वर्धेत ।
(గాయత్రీ) సామమందు  రెండురెండుగా పెరుగును.
10. त्रींस्त्रीनृचाम् ।
(గాయత్రీ) ఋక్కులందు  మూడుమూడుగా (పెరుగును)
11. चतुरश्चतुरः प्राजापत्यायाः ।
(గాయత్రీ)  ప్రజాపతికి నాలుగునాలుగుగా (పెరుగును)
12. एकैकं शेषे ।
(గాయత్రీ) ఒక్కొక్కటిగా మిగిలినవాటియందు (పెరుగుచుండును)
13. जह्यादासुरी ।
ఆసురీ  (ఒక్కటి చొప్పున) తగ్గును.
14. तान्युष्णिगनुष्टुब्बृहतीपङ्क्तित्रिष्टुब्जगत्यः ।
అవి (పెరుగుట తరుగుట క్రమం, గాయత్రీ తర్వాత)  "ఉష్ణిగ్, అనుష్టుబ్, బృహతీ, పఙ్క్తి, త్రిష్టుబ్, జగతీ"లు
15. तिस्रस्तिस्रः सनाम्न्य एकैका ब्राह्म्यः ।
(పైన చెప్పిన) మూడుమూడులు (యజుః+సామ+ఋక్) ఒక్కొక్క బ్రాహ్మ్యమందు (తగును)
16. प्रग्यजुषामार्ष्य इति ।
యజుస్సునకు ముందున్నవి ఆర్ష్యమగును.

పైన చెప్పబడిన వివరములు, క్రింది పట్టికలో అమర్చబడినవి...



इति द्वितियोऽध्यायः ।

अथ तृतीयोऽध्यायः ।  తృతీయోऽధ్యాయము.
1. पादः ।
2. इयादिपूरणः ।
3. गायर्त्या वसवः ।
4. जगत्याः आदित्याः ।
5. विराजो दिशः ।
6. त्रिष्टुभो रुद्राः ।
7. एकद्वित्रिचतुष्पादुक्तपादम् ।
8.

No comments:

Post a Comment